16 July, 2026 | 8:46 AM

ఫిబ్రవరి నుంచి ఎఫ్4?

18-06-2024 12:05 AM

థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులను నవ్వించడం ఎలాగన్నది దర్శకుడు అనిల్ రావిపూడికి బాగా తెలుసు. స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నా అందులో తనదైన వినోదం ఉండేలా చూసుకుంటారాయన. ప్రస్తుతం వెంకటేశ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 58వ చిత్రంగా రానున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి తెరమీదికి రానుంది. ఈ సినిమా పనులు ముగియగానే ‘ఎఫ్4’ సినిమాని అనిల్ ఆరంభించనున్నట్టు సమాచారం.

ఆ ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’  చిత్రాలలో వరుణ్, వెంకటేశ్ కలిసి వినోదాలు పంచగా మూడో భాగం కోసం మరో ప్రముఖ కథానాయుడు రంగంలోకి దిగనున్నారు. దీనికి గాను రవితేజ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి నిర్మాణ వర్గాల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.