calender_icon.png 18 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెక్సికోపై భూతల దాడికి అమెరికా సిద్ధమైందా?

18-01-2026 01:21:25 AM

ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఎఫ్‌ఏఏ కీలక మార్గదర్శకాలు

గగన తలంలో ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్త అంటూ హెచ్చరికలు

ఈ సూచనలు దాడికి సన్నాహాలేనా? అనే అనుమానాలు

వాషింగ్టన్, జనవరి ౧౭: మెక్సికోపై భూతల దాడికి అమెరికా సిద్ధమవుతున్నదా ? అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ ఏఏ)  అందుకే ఎయిర్‌లైన్స్ సంస్థలకు కీలక మార్గదర్శకాలు ఇచ్చిందా? మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామాతోపాటు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో గగనతలం మీదుగా వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యహరించాలని, ౬౦ రోజుల పాటు ఈ హెచ్చరికలు అమలు చేయాలనే ఎఫ్‌ఏఏ సూచనలు దాడికి సంకేతాలా? అనే ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీ యంగా చర్చనీయాంశలయ్యాయి. సైనికదాడులు మొ దలయ్యే అవకాశాలు ఉన్నందు నే ఎఫ్‌ఏఏ పై విధంగా హెచ్చరికలు జారీ చేసిందా.. అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ల్యాండింగ్, టేకాఫ్ దశల్లో ఉన్నా సరే, విమానాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎఫ్‌ఏఏ తన నోటీసుల్లో పేర్కొంది. సాధారణంగా అమెరికా త్వరలో సైనికదాడి చేయాల నుకుంటే తప్ప.. ఇలాంటి నోటీసులు జారీ చేయదు. అందుకే.. లాటిన్ అమెరికాలోని మెక్సికో సహా క్యూబా, కొలంబియా వంటి దేశాల్లో ఆందోళన నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇటీవల లాటిన్ అమెరికన్ దేశా లు పెద్దఎత్తున అమెరికాకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాయ ని ఆరోపించిన సంగతి, పద్ధతి మార్చుకోకపోతే వెనెజువెలా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ట్రంప్ తాజాగా మెక్సికోను టార్గెట్ చేశారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.