calender_icon.png 18 January, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణచివేతకు కిరాయి సైన్యం

18-01-2026 01:18:37 AM

ఇరాక్‌లోకి 5 వేల మంది షియా మిలిషియా ఫైటర్లు

పర్యాటకుల పేరుతో ఇరాక్ నుంచి దిగుమతి

నిరసనకారులపై ఉక్కుపాదం 

వేలాది మంది మృతి

టెహ్రాన్, జనవరి ౧౭: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో జరుగుతున్న పౌరుల పోరాటాన్ని అణచివేసేందుకు ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. సొంత ప్రజలను మట్టుపెట్టేందుకు విదేశీ శక్తుల సహాయం కోరాడు. దీనిలో భాగంగానే ఆయన ఇరాక్ నుంచి సుమారు 5,000 మంది షియా మిలీషియా ఫైటర్లను ఇరాన్‌కు రప్పించాడు. ఈ అంశంపై ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారమ వుతున్నాయి.

కిరాయి సైన్యం గతంలో కతైబ్ హిజ్బుల్లా, హరకత్ అల్ -నుజాబా వంటి సాయుధ గ్రూపుల్లో పనిచేసిన వారని ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ ప్రజలతో వీరికి ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో నిరసనకారులపై అత్యంత క్రూరంగా వారిపై కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 2,600 మందికిపైగా నిరసనకారులు మృతిచెందారు. అనధికారికంగా ఆ సంఖ్య 3,400 దాటి ఉండవచ్చనే మరో అంచనా కూడా ఉంది. అలాగే ప్రభుత్వ చెరలో 20 వేల నుంచి 50 వేల మంది నిరసనకారులు ఉండొచ్చని సమాచారం.

స్వదేశానికి భారతీయులు

ఇరాన్‌లో అంతర్గత ఉద్రిక్తల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వందలాది మంది భారతీయులు శుక్రవారం అర్ధరాత్రి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌లో ఎక్కడ చూసినా ఆందోళనకారులే ఉన్నారని, ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ నిరసనకారుల మృతదేహాలు కనిపిస్తున్నాయని వాపోయారు. 

తాము కనీసం విదేశాంగశాఖ అధికారులను సంప్రదించేందుకైనా వీలు లేకపోయిం దని వెల్లడించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినందుకు భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞ తలు తెలిపారు. ఇరాన్‌లో ప్రస్తుతం 10 వేలమందికి పైగా భారతీయులు ఉన్నట్లు అంచ నా. వీరిని సంప్రదించేందుకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది. వారిని కూడా సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నది.