27 July, 2026 | 1:44 AM

గిరిజన విద్యార్థులకు వసతులు కల్పించాలి

27-07-2026 12:48 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం/మణుగూరు, జులై 26 (విజయక్రాంతి): గిరిజన విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆశ్ర మ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంక టేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరు మండలంలోని డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న గిరిజన ఆశ్రమ బాలికల పా ఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హాస్టల్లో విద్యార్థినులకు అందుతున్న భోజనం, తాగునీరు, పరిశుభ్రత, మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి స మస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు క ల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.