27 July, 2026 | 1:20 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

27-07-2026 12:46 AM

టీజీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్

సత్తుపల్లి. జూలై 26. ( విజయ క్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సత్తుపల్లి డిపో జనరల్ బాడీ సమావేశం ఆదివారం డిపోలో ఘనంగా నిర్వహించారు. డిపో అధ్యక్షులు రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జి.ఎస్. నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)ని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కార్యదర్శి పిల్లి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. 2017, 2021 పీఆర్సీలకు సంబంధించిన బకాయి అలవెన్సులను తక్షణమే ప్రకటించి చెల్లించాలని, కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరిన కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం యూనియన్ డిపో అడ్హాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్త కమిటీ సభ్యులు: గౌరవ అధ్యక్షులుగా  దండు ఆదినారాయణ, అధ్యక్షుడు  రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్  డి. కృష్ణ, చైర్మన్  చెన్నారావు, కార్యదర్శి  ఎన్.ఆర్. కృష్ణ, మహిళా కార్యదర్శి  జానకి, కోశాధికారి  రవిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు బాలరావు, రఘురాం, రాజేష్, రమాదేవి, మహేశ్వరి తదితరులు పాల్గొని ఉద్యోగుల సమస్యలు, సంస్థ అభివృద్ధిపై చర్చించారు. సమావేశం చివర్లో ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.