calender_icon.png 4 August, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ హాస్టల్లో సదుపాయాలు కల్పించాలి

30-11-2024 07:13:07 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంక్షేమ హాస్టళ్లు ఆశ్రమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అన్ని వసతులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంల ఎస్సీ బీసీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని శుద్ధమైన జలాన్ని సరఫరా చేయాలని పేర్కొన్నారు. వంట గదిలను శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని నాణ్యమైన కూరగాయలు నిత్యవసర సరుకులు వినియోగించుకోవాలన్నారు. సంక్షేమ హాస్టల్లో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి అంబాజీ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు.