calender_icon.png 4 August, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో రెండవ స్థానం

30-11-2024 07:09:48 PM

రామాయంపేట: మెదక్ జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్ లో రామాయంపేట పట్టణానికి చెందిన అంజని ప్రసాద అనే విద్యార్థి ద్వితీయ స్థానంలో నిలిచారు. జిల్లా స్థాయిలో ఇన్స్పైర్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో గల తెలంగాణ మోడల్ స్కూల్లో చదువుతున్న అంజనీ ప్రసాద్ పాల్గొని జామెట్రికల్ కాన్సెప్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. దానిని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. ఆయన ప్రదర్శించిన కాన్సెప్ట్ను జిల్లా స్థాయిలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రెండవ ప్రైజ్ ను అందజేశారు. జిల్లా స్థాయిలో రెండవ స్థానం నిలవడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్, విజయలక్ష్మి గైడ్ టీచర్ అరవింద్ కుమార్ ఆయనను అభినందించారు.