calender_icon.png 4 August, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రైతు పండుగను వీక్షించిన రైతులు

30-11-2024 07:17:11 PM

మందమర్రి (విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రైతు పండుగ-రైతు సదస్సును మండలంలోని రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. శనివారం మహబూబ్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమాన్ని మండలంలోని రైతు వేదికలో మండల రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు పండుగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు రుణమాఫీ, ఇతర రైతు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి కిరణ్మయి, ఏఈఓలు ముత్యం తిరుపతి, కనకరాజు, మండలంలోని రైతులు పాల్గొన్నారు.