26-01-2026 12:25:21 PM
కళ్లలో కారం చల్లి....ఆపై కత్తులతో పొడిచి వ్యక్తిని హత్య
అలంపూర్ జనవరి 26: ఒకప్పుడు ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవల జరుగుతుండేవి. ఫ్యాక్షన్ గొడవల వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు చిన్నభిన్నమయ్యేవి.కాలక్రమేణా ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం ఫ్యాక్షన్ గొడవలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో కొంతమేర ప్రశాంతమైన వాతావరణం కనిపించేవి.కానీ ఇంకా అలాంటి ఫ్యాక్షన్ సంస్కృతి అక్కడక్కడ కనిపిస్తోంది.
అలాంటి ఫ్యాక్షన్ తరహాలో ఓ వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపిన ఘటన నడిగడ్డ ప్రాంతం గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణయ్య గౌడ్ 43 మరో వ్యక్తి కలిసి రాత్రి గ్రామ శివారులోని ఒక పొలంలో మద్యం తాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారి కళ్లల్లో కారం చల్లి కత్తులతో అతి కిరాతకంగా దాడి చేశారు.ఈ దాడిలో కృష్ణయ్య గౌడ్ అక్కడిక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.స్థానిక ఎస్సై శేఖర్,తన సిబ్బందితో కలిగి ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.