26-01-2026 12:56:08 PM
తుంగతుర్తి,( విజయ క్రాంతి): మండలంలో 77 వ,గణంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ కార్యాలయంలో కార్యాలయంలో ఎమ్మార్వో దయానంద్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శేష్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎండి గౌస్ పాషా, పోలీస్ స్టేషన్ లో ఎస్సై క్రాంతి కుమార్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడిఏ రమేష్ బాబు, విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ బోయిన్ లింగయ్య, ఉపాధి హామీ కార్యాలయంలో ఏపిఓ కృష్ణ, మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపిఎం అశోక్ కుమార్, పంచాయతీరాజ్ కార్యాలయంలో డి ఈ లింగా నాయక్, ఉప కోశాధికారి కార్యాలయంలో ఎస్ టి ఓ లక్ష్మి, గ్రంధాలయంలో గ్రంథ పాలకుడు రంగారావు, ఏరియా ఆస్పత్రి లో సూపర్డెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ రజిత, ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ శ్రీజ, పశు వైద్యశాలలో పశు వైద్యాధికారి రవి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటిపారుదల శాఖ కార్యాలయం) కార్యాలయంలో అజయ్,విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ సురేందర్ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శి సురేష్, రైతు సేవ సహకార సంఘం కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ బడే సాబ్, లైన్స్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు పాలవరపు సంతోష్,కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (ఆర్డిఆర్ నివాసం) లో పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, మండలంలోని వివిధ గ్రామాలలో నీ గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, మండల కేంద్రంలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, యువజన సంఘాల కార్యాలయంలో అధ్యక్షులు, తదితరులు త్రివర్ణ పతాకాన్నీ ఎగురవేశారు. ఈ వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.