calender_icon.png 26 January, 2026 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 12:35:27 PM

మఠంపల్లి జనవరి 26: మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ ప్రజలకు 77 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్.గ్రామపంచాయతీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించి జాతీయ గీతాలపన చేసి జెండా ఎగరేసి నేటితో రాజ్యాంగం 77వ సంవత్సరంలో అమలు కాబోతున్నందుకు రాజ్యాంగం యొక్క విశిష్టతను గ్రామ ప్రజలకు వివరించి గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని తీర్మానించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నితిన్ నాయక్,గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు గ్రామ సిబ్బంది, నాయకులు పెద్దలు మాజీ వార్డు సభ్యులు,మహిళలు పాల్గొన్నారు