26-01-2026 12:30:22 PM
పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో 77 గణతంత్ర దినోత్సవం సంబరాలు అంబరాన్నంటాయి. వాడ వాడ లా గణతంత్ర వేడుకలు ఆనందోత్సవాలు వేడుకలు జరుపుకున్నారు. ప్రభుత్వ,ప్రవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, గనులు, డిపార్టుమెంట్ల వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. బెల్లంపల్లి జూనీయర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి జే. ముఖేష్, రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్, క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లౌడియా కృష్ణ,అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ ఎ. రవి కుమార్ మువ్వన్నెల జెండావిస్కరించారు.
మున్సిపల్ కార్యాలయoలో కమిషనర్ జే సంపత్ రెడ్డి,టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,ఎంపీడీవో కార్యాలయంలో మహేందర్, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డి వై సీఎంవో పాండు రంగాచారి, శాంతిఖని గని వద్ద మేనేజర్ విజయకుమార్ సిన్హా, కాంగ్రెస్, సీపీఐ, టీ ఆర్ ఎస్, సీపీఎం, టీడీపీ, బీజేపీ ఆఫీసుల వద్ద గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి రూరల్ కార్యాలయం వద్ద సీఐ హనోక్, వన్ టౌన్ వద్ద సీఐ శ్రీనివాసరావు, టూ టౌన్ వద్ద కిరణ్ కుమార్, తాళ్ళ గిరిజాల పోలీస్టేషన్ వద్ద ఎస్ఐ రామకృష్ణ జాతీయ జెండా ఎత్తి గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిపారు.
హెల్మెట్ల పంపిణీ..
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో రోడ్డు భద్రత వారోత్సవాల నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ హెల్మెట్ల పంపిణీ చేశారు. వాహనదారులు భద్రతతో గమ్యాన్ని చేరాలని ఉద్దేశంతో ఆయన హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ నాతరీ స్వామి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మల్లయ్య, మాజీ కౌన్సిలర్ కటకం సతీష్, రోడ్డ శ్యామ్,అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.