26-01-2026 12:54:01 PM
మఠంపల్లి జనవరి 26: మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ,బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రిపటాలకు పూల మాల వేసి జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతం ఆలపించారు.అనంతరం ఉపసర్పంచ్ నితిన్ నాయక్, వార్డు సభ్యులు, మహిళ సంఘం, అధికారుల సమక్షంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యదర్శి, మహిళలు పాల్గొన్నారు.