calender_icon.png 26 January, 2026 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

26-01-2026 12:57:36 PM

కామారెడ్డి , జనవరి 26(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర  సూపర్డెంట్ వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ విలువలకు నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి ప్రతినిత్యం వచ్చిన ప్రజలకు మరింత నిబద్ధతతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.