19 August, 2026 | 2:36 AM

కేపీఆర్‌ఐటీలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

19-08-2026 01:33 AM

ఘట్ కేసర్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆరు రోజుల పాటు నిర్వహించ నున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను మంగళవారం ప్రారంభించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏఐసిటిఈ ట్రైనింగ్ అండ్ లర్నింగ్ అకాడమీ సహకారంతో  ఐ పర్ఫార్మెన్స్ కంప్యూటర్ స్కేలబుల్ అండ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అనే అంశంపై ఆరు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్ టీయూహెచ్ సీనియర్ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. విశ్వ నాథరాజు హాజరై కార్యక్రమాన్ని ప్రారం భించారు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అధ్యాపకులకు లోతైన అవగాహన కల్పించడం, పరిశోధన, బోధనలో వాటి వినియోగాన్ని ప్రోత్సహిం చడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈసందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్  ఎస్. విశ్వనాథ రాజుతో పాటు కెపిఆర్‌ఈఎస్ సీఈవో డాక్టర్ సి.డి. నాయుడు, కేపిఆర్‌ఈఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, కేపిఆర్‌ఐటిసివోఈ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శ్రీనాథ్ కశ్యప్, కేపిఆర్‌ఐటి వైస్ ప్రిన్సిపాల్ వై. విశ్వశ్రీ, కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ పులిమే సత్యనారాయణ, కో-కోఆర్డినేటర్ డాక్టర్  రాజేష్ బనాల ఈ సందర్భంగా మాట్లా డుతూ వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అధ్యాపకులు నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.