19 August, 2026 | 2:41 AM

ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ

19-08-2026 01:32 AM

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ గ్రామంలో రైతులకు ఆర్ పి యల్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ, ఎన్. వెంకట్ రామ్ రెడ్డి నానో యూరియా, నానో డి ఏ పి వినియోగం, ఫలితాల గురించి రైతులకు వివరించారు.

అలాగే నాణ్యమైన విత్తనాల ఎంపిక, సమగ్ర సస్యరక్షణ చర్యలు, కూరగాయల సాగులో ఆధునిక సాంకేతికతలు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఎల్ నినో పరిస్థితుల గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాధవరెడ్డి, కౌన్సిలర్ నువ్వు నా వద్ద పార్వతి, రాజేంద్రనగర్ ఎఫ్ టి సి, ఏవో కృష్ణవేణి, హెచ్ ఓ వెంకటరమణ, ఏ ఈ ఓ తేజస్విని, హెచ్ ఇ ఓ సాగరిక తదితరులు పాల్గొన్నారు.