7 July, 2026 | 1:21 AM

మొలకెత్తని నకిలీ సోయా విత్తనాలు

07-07-2026 12:35 AM
  1. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో వెయ్యి మంది రైతులకు నష్టం
  2. డీలర్ దుకాణం వద్ద ఆందోళన
  3. వేప చెట్టు ఎక్కి నిరసన తెలిపిన రైతు
  4. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన 
  5. కంపెనీ ద్వారా పరిహారం ఇప్పించండి
  6. లేదంటే కేసులు పెట్టాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశం

నిర్మల్/భైంసా, జూలై 6 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గంజ్‌లో నకిలీ సోయా విత్తనాలతో రైతులు నష్టపోయారు. వానకాలం సీజన్‌లో భైంసా మార్కెట్‌లోని ఓ విత్తన డీలర్ వద్ద సోనం సీడ్ కంపెనీకి చెందిన తేజస్విని రకం సోయా విత్తనాలు కొన్నారు. పొలంలో విత్తితే అవి మొలకెత్తకపోవడంతో సోమవారం పెద్ద ఎత్తున రైతులు విత్తన డీలర్ దుకాణం వద్దకు చేరుకున్నారు. బైంసా డివిజన్‌లోని బైంసా రూలర్, కుబీర్, తానూర్, ముధోల్, కుంటాల మండలాలకు చెందిన సుమారు వెయ్యి మంది రైతులు నిరసన తెలిపారు. నాణ్యమైన విత్తనాలు ఇవ్వకపోవడం వల్లనే తమ నష్టపోయామని విత్తన డీలర్లను నిలదీశారు.

విత్త నాల విషయంలో నష్టపోయిన రైతులకు తిరిగి విత్తనాలను ఇస్తామని డీలర్ చెప్పగా విత్తన పెట్టుబడి ఎరువుల మందులు కూలీల రేట్లు యంత్రం కోసం రూ.ఏడువేలు వరకు ఖర్చు పెట్టామని రైతులు మండిపడ్డారు. విత్తనాలు ఇచ్చిన ఇప్పుడు మళ్లీ విత్తుకునే పరిస్థితి లేదని జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులంటూ నిలదీశారు. డీలర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం తో ఆగ్రహించిన రైతులు దుకాణాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

కుబీర్ మం డలం చొండి గ్రామానికి చెందిన రాజలింగం సోనం సీడ్స్ తేజస్విని సోయారకం తొమ్మిది బ్యాగుల విత్తనం ఇచ్చినట్టు తెలిపారు. అది మొలికెత్తలేదని దీనిపై నిలదీస్తే డీలర్లే రైతులపై కేసులు పెడతామని హెచ్చరిస్తున్నట్టు రైతులు పేర్కొన్నారు. చండీ గ్రామానికి చెందిన రాజలింగం అనే రైతు వేప చెట్టు ఎక్కి తనకు చావే గతి అంటూ నిరసన తెలిపాడు. పట్టణ పోలీసులు, మార్కెట్ కమిటీ, వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని రైతులను సముజాయించారు.

చెట్టుపై కూర్చున్న రైతు తో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిం దికి దిగారు. అసలే వర్షాలు కురవక ఇబ్బంది పడుతున్న తమను విత్తనాల పేరుతో మోసం చేశారని పరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నష్టపోయామని బా ధ్యులను వారిపై చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో బైంసా గాంధీ గంజ్‌లో విత్తనాల డీ లర్ల దుకాణాల వద్ద పోలీసు బందోబస్తు ఏ ర్పాటు చేశారు. కాగా భైంసా మండలం మాటేగాంహంపోలి గ్రామ రైతులు మొలకెత్తని సోయా విత్తనాల సమస్యపై  కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. 

తేజస్వీ కంపెనీ సోయా విత్తనా లను సాగు చేసినప్పటికీ, విత్తిన పది రోజులు గడిచినా 20 శాతం కూడా మొలకెత్తలేదని,  ఈ విషయంపై కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా, నష్టపరిహారం ఇవ్వకుండా మరోసారి విత్తుకో వ డా నికి కొత్త విత్తనాల బ్యాగులు ఇస్తామని చె ప్పడం అన్యాయమన్నారు. నాసిరకం విత్తనాలను మార్కెట్లోకి ఎలా విడుదల చేశారో విచా రణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.