19 March, 2026 | 5:54 AM

నిందితులకు కఠిన శిక్షలు విధించాలి

19-03-2026 12:00 AM

పెంచికల్‌పేట్, మార్చి 18(విజయ క్రాంతి): మండలంలోని కొండపల్లి గ్రామం లో ఇటీవల హత్యకు గురైన ఆదివాసి యువతి ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని సిపిఎం, తెలంగాణ ఆదివాసి గిరిజన సం ఘం  నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కూషన రాజన్న, సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్,

టాగ్స్ జిల్లా కార్యదర్శి నెర్పల్లి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ తదితరులు కుటుంబ సభ్యులను కలిసి హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ జిల్లా లో ఇటీవలి కాలంలో ఆదివాసీలపై, ముఖ్యంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్రం సమ్మక్కను ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేసిన నిందితుడు జలపతి ,అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.