బీఆర్‌ఎస్‌లో చేరిన 50 కుటుంబాలు
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా
అశ్వారావుపేట ఆగస్టు 10 (విజయక్రాంతి): అశ్వారావుపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సహజంగా ఇతర పార్టీల నుంచి అధికార ంలో ఉన్న పార్టీలోకి చేరికలు జరుగుతాయి. అశ్వారావుపేటలో మాత్రం దీనికి బిన్నంగా ఉంది. అధికార పార్టీని వీడి కావడిగుండ్ల , కాలానికి చెందిన సుమారు 50 కుటుంబాలకు చెందిన 79 మంది అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ ఎప్పటికైనా పల్లెలు బాగుండాలంటే గులాబీ జెండానే ఎగరాలని అన్నారు. నమ్మించి మోసం చేసే చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు. తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకున్న పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ అని, కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణను బంగారంలా తీర్చిదిద్దుకున్నామని అన్నారు. .తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో తెచ్చిన పనులను సైతం పూర్తి చెయ్యలేని దుస్థితిలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు.
మిగిలిన 2 ఏళ్ళు బి ఆర్ ఎస్ కుటుమసభ్యుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని.ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తప్పకుండా వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్తామని. గతంలోలా అస్సలు ఉండదని స్పష్టం చేశారు. కొమరం రవి ,కణితి వెంకటేష్ ,బాలు ,కొమరం హిమ చందు ఇతరులు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జూపల్లి రమణారావు , మాజీ ఎం పి పి జల్లిపల్లి శ్రీరామమూర్తి , మోహన్ రెడ్డి , యుఎస్ ప్రకాశ్ రావు ,సంక ప్రసాద్ ,కలపాల బాబురావు ,ఉప సర్పంచ్ పాకనాటి నాగేశ్వరరావు ,మాజీ సర్పంచ్ నారం రాజ్ శేఖర్ తదితరులు ఉన్నారు.






