11 August, 2026 | 1:53 AM

జైల్ భరోతో దద్దరిల్లిన కామారెడ్డి

11-08-2026 12:00 AM
  1. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
  2.  సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్

కామారెడ్డి, ఆగస్టు 10 (విజయక్రాంతి): కామారెడ్డిలో సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటియు నాయకులను పోలీసులు అడ్డుకోని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ లేబర్ కోర్డుల రద్దు పాత కార్మిక చట్టాల అమలు కోసం బిజెపి ప్రభుత్వం కుట్ర పన్ను తుందన్నారు.

వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం శాంతియుతంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్షి కొత్త నర్సింలు, అరుణ్ ప్రజా సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేంద్ర ప్రభుత్వానికి కామారెడ్డి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని తేటతెల్లమైందన్నారు.

ఈ దేశంలో రైతులు, కార్మికులు, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆ హక్కులు కోల్పోయే విధానాలు అమలు చేసేవే లేబర్ కోడులన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొత్త నరసింహులు, వెంకటి, సిఐటియు నాయకులు రాజనర్సిం, ముదాం అరుణ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్ల మోహన్, మున్సిపల్ యూనియన్ నాయకులు మహబూబ్, నర్సింగరావు, సంతోష్, దీవెన, శివ, రాజవ్వ, అంగన్వాడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబాయమ్మ, ఇందిరా, లక్ష్మి, ఆశ యూనియన్ నాయకులు రాజశ్రీ, మమత, గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మాచరెడ్డి , స్వామి, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.