calender_icon.png 8 December, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా పట్టివేత

08-12-2025 04:28:29 PM

భీమిని (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని పెద్దపేట గ్రామంలో గుడుంబా అమ్ముతున్న వ్యక్తితో పాటు నాటుసారా పట్టుకున్నామని భీమిని ఎస్సై ఎం విజయ్ కుమార్ తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు సోమవారం పెద్దపేట గ్రామ వాగు వద్ద గుడుంబా అమ్ముతున్న షేక్ ఇస్మాయిల్ ని అదుపులోకి తీసుకొని, 5 లీటర్ ల గుడుంబాని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దాడిలో పోలీసులు ప్రవీణ్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.