13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్సాహంగా ఫేర్వెల్ డే వేడుకలు

09-01-2026 07:19 PM

బిచ్కుంద,(విజయ క్రాంతి): బిచ్కుంద మండలం విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని పిసిసి డెలిగేట్ సభ్యులు విట్టల్ రెడ్డి సూచించారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫేర్వెల్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దర్పల్ గంగాధర్, వాజీద్ నగర్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాలని వారు సూచించారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు.ఫేర్వెల్ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల అద్భుత ప్రదర్శనలు, యువతీయువకుల డీజే డాన్స్ కళాశాల విద్యార్థులకు ఆనందాన్ని కలిగించాయి.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి మరియు లెక్చరర్లు శివ కుమార్, నాగరాజు, శంకర్, సంజు, సామ్సన్ మరియు ఉర్దూ మీడియం కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.