09-01-2026 07:25:39 PM
కోదాడ: కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్ లోని ప్రముఖ రిక్రూటింగ్ స్టాఫ్ఫింగ్ కంపెనీ అయిన ఫ్యూచర్ ఫోకస్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం జరిగినది. ఫ్యూచర్ ఫోకస్ కంపెనీ ఎండీ సయ్యద్ హీన ఆధ్వర్యంలో రిటన్ టెస్ట్, జాం పద్దతి లో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి నులు 16 మంది ఎంపిక అయ్యారు. ఎంపిక అయిన వారికి విద్యార్థి నులకు వార్షిక వేతనం 4,80,000 ఉంటుందని కంపెనీ మానవ వనరుల అధికారులు వైష్ణవి, అనూష తెలిపారు. ప్రాంగణ ఎంపికలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, అధ్యాపకులు అభినందించారు.