17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

9 ఎకరాల వరకు రైతు భరోసా

22-06-2025 12:14 AM
  1. ఇప్పటి వరకు రూ.7,770 కోట్లు విడుదల
  2. మొత్తంగా 66 లక్షల మంది రైతులకు లబ్ధి
  3. శనివారం 9 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.460.24 కోట్లు జమ 

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణలో రైతులను ఆర్థికం గా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. శుక్రవారం 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ అయ్యాయి.

ఇందుకోసం ప్రభుత్వం రూ.905.89 కోట్లు విడుదల చేసింది. శనివారం 9 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రూ.460.24 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు విడతల్లో రూ.7770.83 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేయగా, 66.19 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. అయితే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద రైతులకు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.