04-07-2025 10:27:51 PM
మందమర్రి,(విజయక్రాంతి): బిజెపి జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ కు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గo అశోక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. శుక్రవారం హైదరాబాదులోని లక్ష్మణ్ నివాసంలో ఆయన కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల మాజీ అధ్యక్షులు మంత్రి రామయ్య లు పాల్గొన్నారు.