26 August, 2026 | 3:43 AM

డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

26-08-2026 12:00 AM

లక్కీ డ్రా పద్దతిలో ఎంపిక చేసిన కలెక్టర్

మందమర్రి, ఆగస్టు 25 : మందమర్రి మండల కేంద్రంలోని ఆర్.కె. గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారులను లక్కీ డ్రా పద్దతి ద్వారా కలెక్టర్ కు మార్ దీపక్ ఎంపిక చేశారు. మంగళ వారం డీసీపీ భాస్కర్, మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాయలింగు, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, ఇందిరమ్మ ఇండ్లు పి.డి. బన్సీలాల్ లతో కలిసి హాజరై లక్కీ డ్రా తీశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు రెండు పడక గదుల ఇండ్ల పథకంలో ఇండ్లు కేటాయించడం జరుగుతుందని, పారదర్శకంగా కేటాయింపు కోసం అర్హులైన లబ్ధిదారులకు లక్కీ డ్రా నిర్వహించి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అంతకు ముందు మందమర్రి మండలం బొక్కలగు ట్ట ప్రాంతంలోని గాంధారి వనంలో వన మ హోత్సవం కార్యక్రమంలో భాగంగా డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య, జిల్లా అటవీ అ ధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, క్యాతనపల్లి ము న్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఎంపీడీవో రాజేశ్వర్ లతో కలిసి మొక్కలు నాటారు.