వరి ధ్యానం కోతలపై రైతుల ఆందోళన
ఉట్నూర్, మే 29 ( విజయ క్రాంతి ): ఉట్నూర్ మండలంలో ఐకెపి ఆధ్వర్యంలో జరుగుతున్న వరి ధాన్యం కొలుగోలలో కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉట్లు రైస్ మిల్లు సమీపంలోని ప్రధాన రహదారిపై వరి ధాన్య బస్తాలతో రైతులు ధర్నా చేపట్టారు. రైతులు చేపట్టిన ధర్నా కు బిజెపి నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ కొనుగోలులో జాప్యం చేయడంతో పాటు క్వింటాల్ ధాన్యానికి 13 కిలోల కోత విధించడం రైతులకు అన్యాయం చేయడమేనని ఆయన విమర్శించారు.
రైతులపై భారంగా మారుతున్న ఈ కోతల ను తగ్గించి, గరిష్టంగా క్వింటాల్కు రెండు కేజీలు మాత్రమే కూత విధించాలని డిమాండ్ చేశారు. ఐకెపి సిబ్బంది, రైస్ మిల్లుల నిర్వాహకుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసిల్దార్ రఘునాథరావు, సీఐ మడవి ప్రసాద్, ఎస్త్స్ర విజయ్ కుమార్ లు సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా ను విరమించాలని, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ లేదా ఐటిడిఏ పిఓ లు వచ్చేవరకు ధర్నా కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.
చివరకు జిల్లా కలెక్టర్ కు అధికారులు ఫోన్ ద్వారా మాట్లాడి వారి డిమాండ్లను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా ను విరమించారు. రోడ్డుపై రైతులు బయటయించడంతో ఉట్నూర్ మంచిర్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి కొండూరి రమేష్, మండల శాఖ అధ్యక్షుడు వెంకటేష్, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.






