మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఉట్నూర్, మే 29 (విజయక్రాంతి): మహిళల సంక్షేమమే ప్రజా పాలన ప్రభుత్వం ప ని చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్ర ణాళిక మహిళా వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా తో కలిసి పాల్గొన్న ఖానాపూర్ ఎ మ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి ,ఉట్నూర్, సిరికొం డ, నార్నూర్, గాదిగూడ మండల మహిళా సంఘాల స్వయం ఉపాధి కొరకు సోయా యూనిట్స్ ప్రారంభించారు.
పొదుపు సం ఘాల మహిళలకు 27 లక్షల చెక్కు పంపిణీ చేశారు. వారోత్సవాల్లో బాగంగా మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తున్న స్వయం ఉపాధి స్టాల్స్ నీ జిల్లా కలెక్టర్ రాజర్షిషా తో కలిసి తిలకించారు,వాటి ప్రత్యేకతను తెలుసుకున్నారు. మోవా లడ్డు,పలు తిను బం డరాలను రుచి చూశారు. సెల్ఫీ పాయింట్ ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభు త్వం, అధికారులు నిత్యం మహిళా సంఘాలకు అందుబాటులో ఉంటూ అనేక స్వ యం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్చువల్ గా మహిళా సంఘాలతో మీటింగ్ లో ఒకేసారి అనేక వివో బిల్డింగ్స్ ప్రారంభిం చాం అన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్శి షా మా ట్లాడుతూ... పొదుపు సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని గుర్తు చేశారు. సోయా యూనిట్ ఏర్పాటుకు ఇక్రిసైడ్ సైతం తమ సహకారాన్ని అందిస్తుందని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించిన వివో భవనాలను వచ్చే డిసెంబర్ 9 లోగా భవనాల పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి రవీందర్ రాథోడ్, డి డబ్ల్యు ఓ మిల్కా, మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం, సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్ ల తో పాటు అధికారులు,ఐకేపీ సిబ్బంది, మ హిళా సంఘాలు, అధికారులు కాంగ్రెస్ నా యకులు కార్యకర్తలు తదితరుపాల్గొన్నారు.
కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ..
ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. శుక్రవారం ఇంద్రవెల్లి ఉట్నూరు మండల కేంద్రాల్లో వివిధ గ్రామా ల లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వాన్ని చేపడుతుందని, ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన రైతుల నుండి వారి కూలీ డబ్బులను బ్యాంకు అధికారులు చెల్లించడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ప్రజా పాలన ప్రభుత్వం రైతు భరోసా కింద విడుదల చేసిన డబ్బులను సైతం బ్యాంక్ అధికారులు రైతులకు చెల్లించకుండా అప్పు ఖాతాలో జమ చేస్తున్నట్లు తనకు రోజు ఫోన్ ద్వారా రైతులు తెలుపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల డబ్బులను బ్యాంక్ అధికారులు అప్పు ఖాతాలో జమ చేయడం సరికాదని, వెంటనే వారికి చెల్లించాలని అన్నారు. ఆయనతో పాటు ఉట్నూర్ ఆర్డీవో మోహన్ సింగ్, తాసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






