17 August, 2026 | 3:45 PM

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

17-08-2026 02:36 PM

గుడిహాత్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా గుడిహాత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ స్వయంభు మూర్తి రాములు ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, స్థానికులతో మాట్లాడి ఆలయానికి సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.