calender_icon.png 4 October, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం ఉదయం నుంచే రైతుల ఎదురుచూపులు

04-10-2025 10:15:02 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల( Bejjur mandal) కేంద్రంలో యూరియా కోసం రైతులు తెల్లవారుజామునుండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు ఎదురుచూస్తున్నారు. యూరియా కోసం పలుమార్లు కార్యాలయానికి వచ్చిన యూరియా లభించడం లేదని అందుకోసమే తెల్లవారుజామునే వచ్చి యూరియా కూపన్ల కోసం ఎదురుచూస్తున్నామని రైతులు(Farmers ) తెలుపుతున్నారు. సకాలంలో యూరియా లభించకపోతే పంటలు ఎలా దిగుబడి వస్తాయని రైతులు వాపోతున్నారు. అర్హులైన ప్రతి రైతుకు యూరియా అందించేలా అధికారులు చూడాలని రైతులు కోరుతున్నారు. దళారులకు యూరియా అందించకుండా అర్హులైన ప్రతి రైతుకు యూరియా అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.