04-10-2025 10:22:11 AM
శ్రీ దుర్గా మాత నిమజ్జోత్సవంలో.. భయంకరమైన డీజే చప్పుళ్లు
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) పెద్దేముల్ మండల కేంద్రంలో గత రాత్రి జరిగిన శ్రీ దుర్గా మాత నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ శోభా యాత్రలో భయంకరమైన డీజే సౌండ్ సిస్టం(DJ Sounds) వల్ల వచ్చిన చప్పుళ్లతోదారి పొడవున ఉన్న ప్రజలు, చిన్నారులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వణికిపోయారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు చెవులకు చిల్లులు పడేలా శబ్దాలు రావడంతో స్థానికులు నిద్ర లేక జాగారమే చేశారు. ఈ విషయమై పోలీసులకు స్థానికులు సమాచారం చేరవేసిన అర్ధరాత్రి రెండు గంటల వరకు భయంకరమైన శబ్దాలు ఆగలేదని స్థానికులు అంటున్నారు.