calender_icon.png 4 October, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి.

04-10-2025 09:21:41 AM

మూసాపేట : స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు అమ్మకాలు చేయాలని స్వదేశీ జాగరణ మంచ్ దేవరకద్ర నియోజకవర్గ సంయోజక్ గుజ్జుల గణేష్ నాయుడు కోరారు.  మూసాపేట మండలం వేముల గ్రామంలో స్వదేశీ జాగరణ మంచ్  ప్రచార బ్యానర్ నెలకోల్పోరు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్ర మాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. వేముల ప్రభాకర్ రెడ్డి స్వదేశీ జాగరణ మంచ్ పాలమూరు విభాగ కన్వీనర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసి ట్రంప్ టారిఫ్ లకు సమాధానమివ్వాలని పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యా ప్తంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న ఈ కాలంలో... వ్యాపార మార్గాలు, చెల్లింపు విధానాలు, కరెన్సీలు ఆయుధాలుగా మారుతు న్నాయన్నారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు రక్షణాత్మక విధానాలు అవలంబిస్తూ అధిక పన్ను లు, అన్యాయ పూర్వక అడ్డంకులతో ప్రపంచ ఎగుమతులను అడ్డుకుంటున్నాయన్నారు. చైనా వంటి దేశాలు అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి అతి తక్కువ ధరలో, నాసిరకం వస్తువు లను డంప్ చేస్తూ, బలహీనపరుస్తున్నాయని, స్వదేశీ ఆచరణనే మన జాతీయ ప్రయోజనాలను కాపాడే ప్రధాన ఆయుధమన్నారు. ఈ కార్యక్రమంలో వేముల గ్రామస్తులు స్వదేశీ జాగరణ మంచు మహబూబ్నగర్  జిల్లా కన్వీనర్ తిరుపతి గారి ప్రభాకర్ రెడ్డి  స్వదేశీ జాగరణ మంచు దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ వృద్ధుల గణేష్ నాయుడు మూసాపేట భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు తాటికొండ నరసింహులు, ఆంజనేయులు, సంజీవరెడ్డి,చెన్నారెడ్డి,రాములు పాల్గొన్నారు.