06-11-2025 01:06:46 AM
బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డ బోయిన గోపీ
రాజన్న సిరిసిల్ల నవంబర్ 05 (విజయక్రాంతి):జిల్లాలో వ్యవసాయానికి అనుకూలించని వాతావరణంలో రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో రైతులు ఉన్నారు.ఒకవైపు ఐకెపి కొనుగోలు కేంద్రాలలో నిలిచిపోయిన ధాన్యం సేకరణ, మరోవైపు మొలకెత్తిన ధాన్యంతో మొర పెట్టుకుంటున్న రైతుల గోస ప్రభుత్వానికి పట్టి లేదా ఒక వైపు మ్యాచర్ పేరిట రైతులను ఐకెపి సెంటర్ ల లోనే పడిగాపులు పడుతుంటే రైతుల బాధలు కానరాని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నాయకులు.
మాత్రం జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం లో మునిగిపోవడం సిగ్గుచేటు అన్నారు,ఎద్దు ఏడ్చిన ఎవుసం,రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడలేదని ఇప్పటికైనా స్థానిక మంత్రులు ఎమ్మెల్యే లు కళ్ళు తెరిచి, రాష్ట్రా ప్రభుత్వం మ్యాచర్ నిబంధన లేకుండా జిల్లాలోని మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేని యెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వ ర్యం లో పెద్ద ఎత్తుల ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి ,పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు బూర శేఖర్ మిరియాల్ కార్ బాలాజీ, సౌల్ల క్రాంతి కుమార్, రేపాక రామచంద్రం, పరమేష్, మొకిలి విజేందర్, కోడె రమేష్, లక్పతి నాయక్, పాల్గొన్నారు.