సింగూర్ నీటిని విడుదల చేయండి
సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): సింగూర్ నుంచి నీటి విడుదల పై స్పష్టమైన ఆదేశాలు లేక నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
ఈ మేరకు ఆదివా రం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మౌఖిక ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఫీల్డ్ స్థాయిలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో నీరు పొలాలకు చేరడం లేదన్నారు. ఇప్పటికే సుమారు 30 శాతం పంటలు ఎండిపోయాయని, తక్షణమే నీరందించకపోతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెంటనే లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.




