వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలి.
- బీజేపీ మండల అధ్యక్షులు మిరియాల్కర్ బాలాజీ
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మిర్యాలకార్ బాలాజీ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అనంతరం లారీల కొరత కారణంగా నిల్వ సమస్యలు ఎదుర్కొంటున్నారని, మిల్లుల్లో కూడా వడ్లను ఆలస్యంగా దించుకోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో లారీలు అందుబాటులో ఉంచడంతో పాటు మిల్లుల్లో త్వరితగతిన వడ్ల అన్‌లోడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గొట్టే రామచంద్రం, అజ్మీర్ తండా సర్పంచ్ అజ్మీర జయరాం, మండల ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి జలందర్, మండల ఉపాధ్యక్షులు చింతల పరశురాములు, మండల కోశాధికారి వేల్పుల తిరుపతి, సీనియర్ నాయకులు జింక వెంకటి, చల్ల జితేందర్, అంకమల శంకర్, బెండ శీను, గుల్ల విని లచ్చయ్య, చౌటపల్లి వెంకటి, తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






