16 May, 2026 | 7:10 PM

Breaking News

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే   •   వడూర్ ద్వారా బోత్ బస్సు సర్వీసు   •   పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •   జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక   •  

అక్రమ గోవులను తరలిస్తున్న లారీలు పట్టుకున్న గోరక్షకులు

16-05-2026 05:57 PM

చేగుంట: అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని చేగుంట గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని చేగుంట పోలీసులకు అప్పగించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో ముందస్తు సమాచారంతో గో రక్షక్ కార్యకర్తలు అడ్డగించారు. సమాచారం అందుకున్న చేగుంట ఎస్ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని అదుపు తీసుకున్నారు. లారీలో ఉన్న  30 గోవులను సురక్షితంగా, గోశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.