12 June, 2026 | 1:13 AM

రైతన్నలారా.. ఇకనైనా మారండి

12-06-2026 12:00 AM

రసాయన ఎరువులను వాడకండి

ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లండి

ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను సేంద్రియ సాగువైపు మళ్లిస్తా..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

జమ్మికుంట, జూన్ 11 (విజయక్రాంతి): రసాయన ఎరువుల ద్వారా పండిస్తున్న పంటలను కొని తినడమంటే... పైసలిచ్చి రోగాలను కొని తెచ్చుకోవడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మికుంట కేవీకేలో ‘ప్రక్రుతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం’ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి హాజరై మాట్లాడుతూ.. ఇకనైనా రైతులంతా రసాయన ఎరువుల వాడకాన్ని విడనాడి ప్రక్రుతి వ్యవసాయంపై ద్రుష్టి సారించాలని కోరారు.

ప్రక్రుతి వ్యవసాయం ద్వారా వచ్చే పంటకు మద్దతు ధర రాదనే బాధ అక్కర్లేదన్నారు. సేంద్రీయ వ్యవసా యం చేసిన రైతులు కోటీశ్వరులు అయ్యే అవకాశముందన్నారు. కోటి మంది రైతుల ను ప్రక్రుతి వ్యవసాయంవు మళ్లించడమే ప్రధాని నరేంద్రమోదీ ధ్యేయమన్నారు. మోదీ 4400 రోజుల పాలన పూర్తి నేపథ్యంలో ఆయన స్పూర్తితో రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25 వేల మంది రైతులను ప్రక్రుతి వ్యవసా యంవైపు మళ్లించేలా చర్యలు తీసుకుం టానని హామీ ఇచ్చారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని క్రుషి విజ్ఝాన కేంద్రంలో “ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం” కార్యక్రమాన్ని నిర్వహించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మీ, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రు నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షలు గంగాడి క్రిష్ణారెడ్డి, కేవీకే వ్యవస్థాపక సభ్యులు విజయ పాల్ రెడ్డి,  సీనియర్ సైంటిస్టు వెంకటేశ్వర్ రావు, కిసాన్ మోర్చా నాయకులు మహిపా ల్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.  ఈ  సంద ర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌ను, ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. భూమి పూజ చేశారు. మొక్క నాటారు. ప్రక్రుతి వ్యవసా యం చేస్తున్న రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ప్రక్రుతి వ్యవసాయాన్ని పెంపొందించేందుకు ఆరా తీశారు.