18-07-2025 01:02:23 AM
అధికారుల తీరుపై మండిపడ్డ ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్
కాగజ్‌నగర్, జులై 17(విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం రైతులకు సకాలంలో యూ రియా, ఎరువులను పంపిణీ చేస్తున్నట్లు స్ప ష్టంగా పేర్కొంటున్నప్పటికీ కాగజ్‌నగర్ వ్య వసాయ డివిజన్ పరిధిలో అందుకు భిన్నం గా ఉందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. డివిజన్ పరిధిలో దళారులు ఇష్టారాజ్యంగా యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారు.
వ్యవసాయ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోకపోవ డం గమనార్హం అని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. భారీ వర్షంలోనూ కాగజ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ సొసైటీ కార్యాలయం ఎదుట యూరియా కోసం వర్షంలో తడుస్తూ బారులు తీరారు.
బెజ్జూరు మండలంలో సలుగు పెల్లి గ్రామంలోని వ్యవసాయ సొసైటీ కార్యాలయంలో రైతులకు విక్రయించాల్సిన యూరియాను మార్తడి గ్రామంలోని ఓ నాయకుడి ఇంటి ఎదుట అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆ గ్రామాన్ని సందర్శించిన బిఆర్‌ఎస్ రాష్ర్ట నాయకుడు ఆర్‌ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సత్వరమే ఉన్నతాధికారులు స్పందించి రాయితీ యూరియాను అరులైన రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.