29 April, 2026 | 2:16 AM

చొప్పదండిలో రైతుల ధర్నా

29-04-2026 12:56 AM

మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే

చొప్పదండి:28( విజయ క్రాంతి): ధాన్యం కాంటాకు తంటాలెంటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రైతులు స్థానిక బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి చొప్పదండి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పోలీసులు రైతులను బిఆర్‌ఎస్ నాయకులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ధాన్యం లిఫ్టింగ్కు ఆన్లైన్ ట్రకోట్లు, జీపీఎస్ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేసారు.

వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిబంధన జీపీఎస్, ఆన్లైన్ ట్రక్ట్ పేరుతో అనేకమైన ఇబ్బందులు వస్తాయని అన్నారు.జీపీఎస్, ఆన్లైన్ ట్రక్ట్వ్రాణాకు తప్పనిసరి చేస్తే, ట్రాక్టర్కు రూ.4 వేల వరకు ఖర్చు వరకు రైతులకు భారం పడుతుందని అన్నారు. ఈ పద్ధతిలో ఒక్కో కేంద్రంలో వడ్లు ఎత్తేందుకు 2 నెలల సమయం పట్టి, అకాల వర్షాలు పడితే అన్నదాతల గతి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఇప్పటికే అన్నదాతలకు శాపంలా మారిందని, కొనుగోలు కేంద్రాల పరిధిలో నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు రైతుల పాలిట శరాఘాతంగా మారే ప్రమాదమున్నది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల నుండి విముఖత వ్యక్తం అవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెడ చెవిన పెడుతున్నాయని అన్నారు.

వడ్ల కొనుగోలు

కేంద్రాల నుంచి మిల్లులకు ట్రాన్స్ పోర్టు చేసే వాహనాలకు జీపీఎస్ విధానం ఏర్పాటు చేయాలనే నిబంధనను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద వివిధ కారణాల వల్ల కొనుగోళ్లు మందకొడిగా సాగుతు న్నాయని,ఈ పరిస్థితుల్లో కొత్త నిబందనలు పెట్టడం వల్ల రైతులకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయని,కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పాత నిబంధన ప్రకారమే,వర్షాలు రాకముందే కొనుగోళ్ల పక్రియ వేగవంత చేసి అన్నదాతలను ఆదుకోవాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించారు.