హాజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి రావాలి
మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి
సూర్యాపేట, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): హజ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి రావాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి ఆకాంక్షించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్టార్ట్ బ్లాంకెట్ హాల్లో హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు హజ్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాత్రలు మనసుకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని అందిస్తాయని ఆమె పేర్కొన్నారు. హజ్ యాత్రలో పాల్గొనే భక్తులు నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని, పరస్పర సహకారంతో యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.
అదేవి ధంగా, యాత్రికులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రభుత్వం సూచించిన భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్స్ జహీర్, గుణగంటి హేమా సతీష్, తహేర్, హాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు హఫీజ్ ఖలీల్ సాబ్, సెక్రటరీ అబు బకర్ సిద్ధిక్, మౌలానా సాబ్, జిల్లా హాజ్ కమిటీ సభ్యులు ఇమ్రాన్, ఎండి మజహర్, తదితరులు పాల్గొన్నారు.






