4 June, 2026 | 1:01 AM

రాయిలాపూర్‌లో రైతుల ఆందోళన

04-06-2026 12:19 AM

రామాయంపేట, జూన్ 3 : రామాయంపేట మండలం రాయిలాపూర్ లో  రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. ఆరు గాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు సెంటర్ నిర్వాహకులు దోచుకుంటు న్నారని వారిపై చర్యలు  తీసుకోవాలని  డి మాండ్ చేశారు. గ్రామంలో పీ ఏ సీ ఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం కొనసాగుతుంది. కాగా అక్కడి నిర్వాహకులు  అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు పెద్ద  ఎత్తున సెంటర్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

నిర్వాహకులపై మండి పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  బస్తాకు 42 కిలోల 400 గ్రాముల వరకు కాంటా పెట్టిన, తరుగు వ స్తుందంటూ ఒక్కో లారీకి 5 నుంచి 10 క్విం టాళ్ల వడ్లు కట్ చేస్తున్నారనీ వారు ఆరోపించారు. అలాగే వారు  తమ పేర బస్తాలను  అక్రమంగా నమోదు  చేసుకుని  అవకతకలకు పాల్పడుతూ  రైతుల్ని మోసం చేస్తున్నా రని వారు ఆరోపించారు. అవతకలకు పాల్పడుతున్న నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని వారు