పక్షవాతం బారినపడిన స్నేహితుడికి మిత్రుల అండ
రూ.38 వేల ఆర్థిక సహాయం అందజేత
వనపర్తి టౌన్, జూన్ 3: పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమైన తమ చిన్ననాటి స్నేహితుడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్) 2000-01 బ్యాచ్ మిత్రులు ఆర్థికంగా అండగా నిలిచారు. వనపర్తి పట్టణానికి చెందిన స్నేహితుడు ఆంజనేయులు అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న మిత్రబృందం కలిసి రూ.38 వేల ఆర్థిక సహాయాన్ని బుధవారం అతని నివాస గృహంలో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా స్నేహితులు ఆంజనేయులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో ఉమామహేశ్వర్, అబ్దుల్లా, మల్లేష్ యాదవ్, దేవయ్య, మారం మల్లేష్, భాస్కర్, నగేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మిగిలిన మిత్రబృంద సభ్యులు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






