11 March, 2026 | 4:36 AM

నేడు కొత్త గవర్నర్ ప్రమాణం

11-03-2026 12:00 AM

హైదరాబాద్‌కు చేరుకున్న శివప్రతాప్ శుక్లా 

స్వాగతం పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్‌కుమార్‌సింగ్ కొత్త గవర్నర్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇందుకు లోక్‌భవన్‌లో అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ క్రమంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేసింది.

తెలంగాణలో పనిచేస్తున్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు కొత్తగా నియామకమైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్ర యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివదర్‌రెడ్డి  స్వాగతం పలికారు. ఆ తర్వాత అక్క డే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.