calender_icon.png 15 September, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎగిలివారకముందే..

15-09-2025 01:55:54 AM

యూరియా కోసం రైతన్నల బారులు

  1. గంటల తరబడి నిల్చొన్నా దొరకని బస్తాలు 
  2. కామారెడ్డిలో మహిళల వాగ్వాదం
  3. యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి 
  4. ఎరువుల కోసం క్యూలైన్‌లో మాజీమంత్రి సత్యవతి రాథోఢ్ 
  5. ఎమ్మెల్యే పీఏనంటూ లారీ యూరియాను దారి మళ్లించిన గన్‌మెన్

మహబూబాబాద్/కామారెడ్డి/నల్లగొండ క్రైమ్/మిడ్జిల్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఎగిలివారకముందే యూరియా కోసం రైతన్నలు బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిల్చొన్నా దొరకని పరిస్థితి నెలకొంది. నెల రోజులుగా యూరియా కోసం అన్నదాతల ఆక్రందణలు ఆకాశాన్నంటుతున్నాయి.

యూరియా కోసం బైక్‌పై వెళ్తున్న ఇద్దరు రైతులను బొలెరో ఢీకొనడంతో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం రెవె న్యూ గ్రామ శివారు దుబ్బ తండా, జోషికి తండాకు చెందిన బానోతు లాల్యా (77), ధారావత్ వీరన్న (46) ఉదయం పూట బొద్దుగొండ రైతు వేదిక క్లస్టర్ వద్దకు యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా, జగన్నాయకులగూడెం క్రాస్ రోడ్ వద్ద, నర్సంపేట్ మహబూబాబాద్ జాతీయ రహదారిపై బొలేరో వాహనం ఢీకొంది.

లాల్యా అక్కడికక్కడే మృతిచెందగా,  ధారావత్ వీరన్నను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో తుదిశ్వాస విడిచాడు. యూరియా బస్తాల కోసం వెళ్లి ఇద్దరు రైతులు దుర్మరణం చెందడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైటాయించి, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.

మహిళా రైతుల వాగ్వాదం..

కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులకు తంటాలు తప్పడం లేదు. జిల్లాలోని రామారెడ్డి మండలం రెడ్డిపేట, అన్నారం గ్రామాల్లో రైతులు తెల్లవారు నుంచే క్యూ కట్టారు. గంటల తరబడి వేచిఉన్నా యూరియా బస్తాలు రాకపో వడంతో మహిళా రైతులు వాగ్వాదానికి దిగారు. ఇండ్లల్లో వంట సైతం చేసుకోకుండా వచ్చి క్యూలో నిల్చొంటే యూరి యా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్లరి చేయకుండా క్యూ పాటిస్తే వచ్చిన కాడికి యూరియా బస్తాలు సరఫరా చేస్తామని అధికారులు సర్ధిచెప్ప డంతో అల్లరి సద్దు మణిగింది. అనంతరం రైతులకు 600 యూరియా బస్తాలు సరఫరా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జి ల్ మండలంలోని సింగిల్ విండో కార్యాలయం, హక్ సెంటర్, అజయ్ ట్రేడర్స్, రాణిపేట్ ఆగ్రో సెంటర్ తెల్లవారుజాము నుంచే రైతులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిల్చొన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే లభించింది. దీంతో చేసేదేమీ లేక అన్నదాతలు నిరాశతో వెనుదిరిగారు.

ఎమ్మెల్యే పీఏనంటూ నిర్వాకం..

ఎమ్మెల్యే పీఏనంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు ఎమ్మెల్యేకు చెందిన ఓ గన్‌మెన్ జిల్లా స్థాయి అధికారికి ఫోన్ చేసి లారీ యూరియాను పక్కదారి పట్టించాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. రైతుల నుంచి విన్నపాలు వస్తున్న నేపథ్యంలో యూరియా విషయమై ఎమ్మె ల్యే సైతం అధికారులకు ఫోన్ చేయగా విషయం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

క్యూలో మాజీ మంత్రి..

యూరియా కొరత అంద ర్నీ వేధిస్తోంది. మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం మహ బూబాబాద్ జిల్లా గుండ్రాతిమగుడు సొసైటీ వద్ద యూరియా కోసం వచ్చి అందరితో పాటు లైన్‌లో నిల్చొని టోకెన్ తీసుకున్నారు. తనకున్న ఐదున్నర ఎకరాల భూమి చల్లేందుకు యూరియా అవసరమని, ఇప్పటివరకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని, తమ కుటుంబ సభ్యులను పంపినా ఇవ్వకపోవడంతో తానే స్వయంగా వచ్చానంటే రాథోడ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డ పదేండ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ రైతన్నలకు ఇంతటి ఆపద రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొరతపై కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేసుకోవడానికే సరిపోతుందని ఆరోపించారు.

మేమూ ఓ చేయేస్తాం..

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కాంపల్లి సొసైటీలో యూరి యా బస్తాలు తీసుకున్న రైతు.. వాటిని తన బైక్‌పై పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమం లో పక్కనే ఉన్న జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్.. మేం ఓ చేయేస్తామంటూ సిబ్బంది చేత అతడి బండి మీద యూరియా బస్తాలు పెట్టించారు.