calender_icon.png 11 September, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం అన్నదాతల అష్టకష్టాలు

11-09-2025 11:49:38 AM

వర్షం కురుస్తున్నా.. క్యూ లైన్ లోనే రైతన్నలు.. 

గుండె తరుక్కుపోయే దృశ్యం.

తాండూరు, (విజయక్రాంతి): అన్నం పెట్టే అన్నదాతకు యూరియా కష్టాలు ఇంకా తప్పడం లేదు. యూరియా కోసం గత పదిహేను 20 రోజులుగా రైతు సేవా సహకార సంఘం, అన్నదాత గ్రోమోర్ సేవ కేంద్రం వద్ద భారీగా క్యూ కట్టిన సంగతి తెలిసిందే. అయినా యూరియా లభించకపోవడంతో రైతన్నలు భేజారైపోతున్నారు. ఇక తాజాగా నేడు యూరియా కోసం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో ఉన్న రైతు సేవా సహకార సంఘం వద్ద టోకెన్ల కోసం క్యూ కట్టారు .  అయితే భారీగా వర్షం కురుస్తున్న కూడా క్యూలైన్ వదల్లేక యూరియా కోసం రైతన్నలు వర్షంలోనే తడుస్తూ బారులు తీరిన దృశ్యం చూస్తే గుండె తరుక్కుపోతుంది.