11-09-2025 11:51:18 AM
పెబ్బేరు రూరల్: వనపర్తి జిల్లా పెబ్బేరు మండల రిపోర్టర్ గా కొనసాగుతున్న నారా శ్రీనివాసులు టియుడబ్ల్యూజే, ఐజేయు యూనియన్ లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని తన సహచర మిత్రులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు మంగళవారం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, మిత్రులు సితార వెంకటేశ్వర్లు, అజంతా వెంకటన్న, తేజ విజయ్, పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌని వెంకటన్న గౌడ్, గుడిసె వేణు, బాలస్వామి, సందీప్ రెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.