31-12-2025 12:19:13 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): డీసీసీబీ చైర్మన్‌గా సేవలందిస్తూ, సహకార రంగాన్ని విశేషంగా అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన కొండూరు రవీందర్ రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్ ను కొండూరు రవీందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహకార రంగంలో ఆయన అందించిన సుదీర్ఘ సేవలు, అమలు చేసిన సంస్కరణలు, కరీంనగర్ డీసీసీబీని ఆదర్శ సంస్థగా నిలిపిన తీరును కేసీఆర్ కొనియాడారు.నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకును లాభాల బాటలో నడిపించి, రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకు బలమైన ఆర్థిక అండగా నిలిపిన ఘనత కొండూరు రవీందర్ రావు దక్కుతుందని కేసీఆర్ ప్రశంసించారు. సహకార రంగానికి ఆయన చేసిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.