calender_icon.png 31 December, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసు బందోబస్తు

31-12-2025 12:12:19 PM

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల(New Year celebrations) దృష్ట్యా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి కమిషనరేట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రి వేల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు(Drunk driving checks) ముమ్మరం చేసేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుంపులుగా రోడ్లపైకి చేరవద్దని పోలీసులు హెచ్చరించారు. పబ్ లు, ఈవెంట్ ప్రాంతాలపై సీసీ కెమెరాల నిఘాతో పెట్టారు. ఎక్సైజ్, ఈగల్, కమిషనరేట్ పోలీసులు అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు.

మహిళల భద్రతకు ప్రత్యేక షీటీమ్స్, పెట్రోలింగ్ నిర్వహిస్తాయి. ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) విధించారు. ఎన్టీఆర్‌ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో వాహనాలకు అనుమతి నిరాకరించారు. రాత్రి బేగంపేట్‌, టోలీచౌకి మినహా అన్ని ఫ్లైఓర్లు మూసివేయనున్నారు. విమానం టికెట్‌ ఉంటేనే  పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపైకి అనుమతించనున్నట్లు పోలీసులు చెప్పారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్‌ సిటీలోకి ప్రైవేట్‌ బస్సులు,  భారీ వాహనాలను నిషేధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే రూ. 10 వేలు జరిమానా, లేదా ఆరు నెలల జైలుశిక్ష వేస్తామని పోలీసులు తెలిపారు.