31-12-2025 12:15:07 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మొదటి వార్డులో,వార్డు మెంబర్లతో కలిసి స్వయంగా తానే పార పట్టి పారిశుద్ధ్య కార్మికుడిగా మారి, మురికి కాల్వలను సర్పంచ్ మల్లెపాక సాయిబాబా(Sarpanch Sai Baba) బుధవారం పరిశుభ్రం చేశారు. మురికి కాల్వల్లో మొత్తం చెత్తాచెదారంతో నిండిపోవడంతో పారతో కలిసి శుభ్రం చేయడంతో వార్డు ప్రజలు వారిని చూసి సంతోషం వ్యక్తం చేశారు.
పారిశుద్ధ్యంలో తుంగతుర్తి పట్టణాన్ని, అభివృద్ధిలో ఆదర్శ గ్రామముగా, కృషి చేయుటకు గ్రామ ప్రజలు యువత పాలుపంచుకోవాలని కోరారు. గ్రామపంచాయతీ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని కోరారు. ప్రతి సర్పంచ్ కష్టపడి ఈ విధంగా ముందుకు సాగితే, తుంగతుర్తి మండలం అభివృద్ధిలో ముందంజ వేస్తుందని మేధావులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎనగందుల శ్రీనివాస్, వార్డు మెంబర్లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.