calender_icon.png 31 December, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతుల గోస

31-12-2025 12:28:50 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో(Warangal district) రైతులు యూరియా(Urea) కోసం గోస పడుతున్నారు. యూరియా కోసం వ్యవసాయ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ సరిగా పనిచేయకపోవడంతో రైతులకు కష్టాలు మళ్ళీ మొదటికి వచ్చాయి. దీనితో వ్యవసాయ శాఖ అధికారులు సైతం యాప్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేంతవరకు పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామునే రైతులు రైతు వేదికలు, సొసైటీల వద్దకు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ పత్రాలతో తరలివచ్చారు. విపరీతమైన చలిలో సైతం రైతులు యూరియా కోసం తరలి రావడంతో వివిధ చోట్ల  పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. క్యూ పద్ధతి కోసం ప్రత్యేకంగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రైతుకు సాగు భూమి ఆధారంగా ఒకటి నుంచి మూడు చొప్పున యూరియా బస్తాలు పంపిణీ చేశారు.